- మాలల సింహ గర్జన గ్రాండ్ సక్సెస్ అయింది: సతీశ్ మాదిగ
హైదరాబాద్, వెలుగు: క్రీమిలేయర్కు తాము కూడా వ్యతిరేకమని కాంగ్రెస్ నేత సతీశ్ మాది గ అన్నారు. మాలల ఆత్మగౌరవం కోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన మాలల సింహ గర్జన సక్సెస్ అయిందని తెలిపారు. మాలలు తక్కువ ఉన్నారన్న నేతల విమర్శలకు ఈ మీటింగ్ సమాధానం ఇచ్చిందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వ ర్యంలో మాలలంతా ఒక్కతాటిపైకి వచ్చి సభ ను విజయవంతం చేశారని అన్నారు.
కాకా కుటుంబం నుంచి వివేక్ వెంకటస్వామికి మం త్రి పదవి ఇవ్వాలని సతీశ్ మాదిగ కోరారు. వర్గీకరణకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు తీర్మానా లు చేశాయని గుర్తుచేశారు. త్వరలో మాలలు, మాదిగలు కలిసి పరేడ్ గ్రౌండ్లో భారీ మీటింగ్ నిర్వహించి.. రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తామని ప్రకటించారు.
సింహగర్జనపై మంద క్రిష్ణ మాదిగ ఇష్టమొచ్చినట్టు అవమానకరంగా మా ట్లాడుతున్నారని, రెండు కులాల మధ్య చిచ్చుపెట్టి తన వ్యక్తిగత, రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారని సతీశ్ మాదిగ మండిపడ్డారు.