గ్రాండ్‌గా వాణినికేతన్‌ యాన్యువల్‌ డే

గ్రాండ్‌గా వాణినికేతన్‌ యాన్యువల్‌ డే

కరీంనగర్ టౌన్,వెలుగు: వీఫెస్ట్ 2024 పేరిట వాణినికేతన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ యాన్యువల్‌ డేను ఘనంగా నిర్వహించారు. శనివారం సిటీలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్ హాల్‌లో 30వ యాన్యువల్‌డే వేడుకల్లో ఎస్‌యూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ డాక్టర్ ఎన్‌వీ రంగప్రసాద్, కాలేజీ సెక్రటరీ ఐ.లక్ష్మీదీపిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగప్రసాద్ మాట్లాడుతూ ఈ కాలేజీలో చదువుకుని, ఇక్కడికే అతిథిగా రావడం ఆనందంగా ఉందన్నారు.  30ఏళ్ల ప్రస్థానంలో ఈ కాలేజీలో చదివి ఎందరో గొప్పవాళ్లు అయ్యారన్నారు. సెక్రటరీ మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో లక్ష్యసాధన దిశగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ వెంకట్ రావు,  ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి,  డా.ప్రశాంత్ రావు పాల్గొన్నారు.