పెద్దమ్మ తల్లి ఆలయంలో ఘనంగా జలాధివాసం

పెద్దమ్మ తల్లి ఆలయంలో ఘనంగా జలాధివాసం

పాల్వంచ, వెలుగు : మండలంలోని పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో  కొత్తగా నిర్మించిన శివాలయంలో ఈనెల 10న విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా శుక్రవారం ఉత్స వ విగ్రహాలకు జలాధివాసం ఘనంగా నిర్వహించారు. కేశవాపురం జగన్నాథపురానికి చెందిన మహిళా భక్తులు పసుపు చీరలు ధరించి పవిత్ర జలాలను తీసుకు వచ్చి విగ్రహాలకు అభిషేకం చేశారు. 

పెద్దమ్మతల్లి షష్ఠాబ్ది పూర్వక మహా కుంభాభిషేకం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వందలాది మంది మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ఈవో రజినీకుమారి నేతృత్వంలో పూజలు జరిగాయి. ఈ వేడుకలో మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీలు ఎర్రం శెట్టి ముత్తయ్య, నంద నాయక్, పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.