మారిషస్‎​లో ప్రధాని మోడీకి గ్రాండ్​ వెల్​కమ్​

మారిషస్‎​లో ప్రధాని మోడీకి గ్రాండ్​ వెల్​కమ్​

పోర్ట్​లూయిస్: రెండు రోజుల పర్యటన నిమిత్తం మారిషస్‎కు చేరుకున్న  ప్రధాని నరేంద్ర మోదీకి గ్రాండ్​వెల్​కమ్ లభించింది. పోర్ట్​లూయిస్‎లోని సీవోసాగర్​రామ్​గూలం ఇంటర్నేషనల్​ఎయిర్​పోర్ట్‎లో దిగిన ఆయనకు 200 ప్రముఖులతో కలిసి ఆ దేశ ప్రధాని నవీన్​చంద్ర రామ్​గూలం పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. బిహారీ సంప్రదాయ  ‘గీత్​గవాయ్​’ ప్రదర్శనతో ప్రవాస భారతీయ మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ.. ‘భారత్​మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. 

మారిషస్‎లో ప్రవాస భారతీయులనుంచి లభించిన ఆత్మీయ స్వాగతం తనను ఎంతగానో కదిలించిందని మోదీ ట్వీట్​ చేశారు. భారతీయ వారసత్వం, సంస్కృతి, విలువలతో కూడిన వారి బలమైన బంధం నిజంగా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ చరిత్ర, బంధం తర్వాతి తరాలకు వర్ధిల్లుతూనే ఉండాలని అన్నారు. అలాగే, ఎయిర్​పోర్ట్‎లో తనను ప్రత్యేకంగా ఆహ్వానించిన మిత్రుడు నవీన్​చంద్ర రామ్​గూలంకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ప్రధాని మోదీ మారిషస్‎లో రెండు రోజులు పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

మోదీకి అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత అవార్డు ‘ది గ్రాండ్​కమాండర్​ఆఫ్​ది ఆర్డర్ ఆఫ్​ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’‎ను ఆ దేశ ప్రధాని నవీన్ రామ్ గులాం ప్రకటించారు. ఆయనతో కలిసి మారిషస్​జాతిపిత సీవోసాగర్‌‌‌‌ రామ్‌‌‌‌గూలం పేరు మీదుగా ఏర్పాటు చేసిన గార్డెన్‌‌‌‌ను సందర్శించారు. అక్కడ ‘ఏక్​ పేడ్​మా కే నామ్’ అనే కార్యక్రమంలో భాగంగా ప్రధానులు ఇద్దరూ బేల్​యాపిల్​ మొక్కలు నాటారు. కాగా, మారిషస్​ ప్రెసిడెంట్​ధరమ్​గోకుల్‎​తోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. త్రివేణి సంగమ జలంతో పాటు అరుదైన కానుకలు అందజేశారు.