
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి ఇండియాకు తిరిగొచ్చిన షూటర్ మను భాకర్‌కు ఘన స్వాగతం లభించింది. పారిస్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన ఆమెకు వందలాది మంది అభిమానులు శాలువాలు కప్పి పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు. బ్యానర్లు ప్రదర్శిస్తూ, డ్రమ్స్ వాయిస్తూ, డ్యాన్స్‌లు చేస్తూ భాకర్‌ను ఊరేగింపుగా తీసుకెళ్లారు.