నానమ్మను హత్య చేసిన మనుమడు

నానమ్మను హత్య చేసిన మనుమడు

కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో నానమ్మను మనువడు హత్య చేశాడు. కొడిమ్యాల ఎస్ఐ సందీప్  తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపెల్లి మండలం గుట్టలపల్లి గ్రామానికి చెందిన కాసర్ల సురేశ్​ 15 ఏండ్లుగా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో ఉంటున్నారు. సురేశ్​ ఏ పని చేయకుండా ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. 

ఆదివారం నానమ్మ కాసర్ల లస్మవ్వ(75) ఏదో ఒక పని చేసుకోవాలని, ఇంటి వద్ద ఖాళీగా ఉండవద్దని సురేశ్ ను మందలించగా, కోపంతో కర్రతో ఆమెపై దాడి చేశాడు. చేతికి, తలకు తీవ్రగాయాలు కావడంతో, ఆమెను జగిత్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మనువరాలు యమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.