గృహలక్ష్మి మంజూరు పత్రాల పంపిణీ: అజయ్ కుమార్

ఖమ్మం టౌన్,వెలుగు: గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ నుమంత్రి  అజయ్ కుమార్  సోమవారం పంపిణీ చేశారు. పలు డివిజన్లలో  రూ.16.90 కోట్లతో  చేపట్టే  పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గృహలక్ష్మి పథకం ద్వారా మంజూరు  పత్రాలను  అందజేశారు. జీఓ నెంబర్.58, 59 పట్టాలను భక్తరామదాసు  కళాక్షేత్రంలో, రఘునాధపాలెం మండలం రైతు వేదికలో లబ్ధిదారులకు  పంపిణీ చేశారు. 

నగరంలోని శ్రీనగర్ కాలనీ  సెంచరీ స్కూల్ వద్ద జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ నగరాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. 2014 కి ముందు,  2023లో జరిగిన అభివృద్ధిలో తేడాను గమనించాలన్నారు. ఇదే ఒరవడి కొనసాగాలంటే ఇక్కడ తనను, అక్కడ కేసీఅర్ ను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతకముందు నగరంలోని గాంధీచౌక్ సెంటర్​లో   గాంధీ చిత్రపటానికి ఎంపీ రవిచంద్రతో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు.  కార్యక్రమంలో    ప్రభాకర్, నాయకులు,  అధికారులు,  ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.