ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధికి నిధులు మంజూరు

ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధికి నిధులు మంజూరు

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో వరంగల్-​ కరీంనగర్ హైవే ఎన్​హెచ్ (563), సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే (765 డీజీ)లను కలిపే కూడలి అభివృద్ధికి కుడా (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) రూ.1.53 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలనా అనుమతుల పత్రాన్ని కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ కు సెక్రటేరియట్ లో బుధవారం అందజేశారు.

ఇటీవల రెండు హైవేలను అనుసంధానం చేయడంలో ప్రధానమైనదని, మంత్రి పొన్నం ప్రభాకర్ కుడా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రాథమిక అంచనాల ఆధారంగా జంక్షన్​ అభివృద్ధి, సుందరీకరణకు రూ.1.53 కోట్లు విడుదల చేశారు. దీంతో నిధులు మంజూరు చేయించిన మంత్రికి టీపీసీసీ మెంబర్​అశోక్​రెడ్డి, మండలాధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, స్థానిక నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.