
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గంలో పలు గవర్నమెంట్స్కూల్స్లో సైన్స్ ల్యాబ్ ల ఏర్పాటు కు రూ. కోటి 8 లక్షల నిధులు మంజూరైనట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 8 గవర్నమెంట్స్కూల్స్లో ఒక్కో ల్యాబ్ ను రూ.13 లక్షల 50 వేలతో నిర్మిస్తామన్నారు.
రూరల్ మండలంలోని పుల్లూరు జడ్పీ హై స్కూల్, చిన్నకోడూర్ మండలం లోని విఠలా పూర్ , మాచాపూర్, రాముని పట్ల గ్రామాల్లోని జడ్పీ హై స్కూల్ , నంగునూర్ మండలం లోని ఆంక్షపూర్ జడ్పీ హై స్కూల్, నారాయణ రావు పేట మండలం గుర్రాల గొంది జడ్పీ హై స్కూల్, సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ హైస్కూల్, నాసర్ పురా ఉర్దూ మీడియం, ప్రభుత్వ న్యూ హైస్కూల్ లలో ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.