- ఈ అకడమిక్ ఇయర్ నుంచే క్లాసులు
- 300 సీట్లు కేటాయింపు
కూసుమంచి,వెలుగు : పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం పాలేరుకు జేఎన్టీయూ కళాశాలను మంజూరు చేస్తూ సోమవారం జీవోను విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ జారీ చేశారు. సీఎస్ఈ, ఈసీఈ, సీఎస్ఈ(డేటా సైన్స్), ఈఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలు ఉంటాయన్నారు. 300 మంది విద్యార్దులతో ఈ అకాడమిక్ ఇయర్ నుంచే క్లాసులు ప్రారంభమవుతాయని జీవోలో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీ కోసం నిర్మించిన బిల్డింగ్‌లో ఐదు బ్రాంచ్ లతో కాలేజీ ఏర్పాటు కానుంది. దీంతో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి కృషి ఫలించినట్లయింది. సీఎం కేసీఆర్ కు, విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ఎమ్మెల్యే కందాళ ధన్యవాదాలు తెలియజేశారు.