- ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వేణు
నిజామాబాద్ సిటీ, వెలుగు : విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగానే కమ్మర్పల్లిలో గవర్నమెంట్జూనియర్ కాలేజీ మంజూరైందని ఎన్ఎస్ యూఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ 2014 నుంచి కమ్మర్పల్లిలో కాలేజీని ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తున్నాయన్నారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం దాన్ని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తానే కాలేజీ ఏర్పాటుకు కృషి చేసినట్లు చెబుతున్నారన్నారు. తొమ్మిదేండ్ల నుంచి అధికారంలో ఉండి కాలేజీని మంజూరు చేయించలేకపోయారన్నారు. ఎన్ఎస్ యూఐ జిల్లా నాయకులు అష్రఫ్, నిఖిల్ రెడ్డి, కిరణ్ రెడ్డి,శివ, జయంత్, నిఖిల్ పాల్గొన్నారు.