
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్‌లోని కాకినాడ వద్ద ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ జోన్స్ (జీపీజెడ్) ఏర్పాటుకు గ్రీన్కో గ్రూప్‌తో గ్రాన్యూల్స్ ఇండియా చేతులు కలిపింది. 100 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2 వేల కోట్లతో అయిదేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు. కెమికల్స్‌ను ఎక్కువగా వాడే ఫార్మా ఇండస్ట్రీ నుంచి కార్బన్ ఎమిషన్స్ కూడా ఎక్కువగానే వెలువడతాయి. ఈ నేపథ్యంలో గ్రీన్ మాలిక్యూల్ సొల్యూషన్స్ కోసం రెండు కంపెనీలు జతకట్టాయి. కొత్తగా పెట్టే ఫెసిలిటీలో కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కేఎస్ఎం), ఇంటర్మీడియెట్స్, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రీడియెంట్స్) లు తయారవుతాయని, వాటితోపాటు ఫెర్మెంటేషన్ బేస్డ్ ప్రొడక్టులూ ఉంటాయని గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది.
ఈ ప్రాజెక్టు కోసం గ్రీన్కో సబ్సిడరీ కంపెనీ గ్రీన్కో జీరో సీ కార్బన్ ఫ్రీ ఎనర్జీని సప్లయ్ చేస్తుందని పేర్కొంది. గ్రీన్హైడ్రోజన్, దాని డెరివేటివ్స్నూ గ్రీన్కో అందించనుందని వివరించింది. మెట్‌ఫార్మిన్‌లో వాడే డైసయానమైడ్, పారాసిట్మాల్ తయారీలో వాడే పారా అమినో ఫెనాల్ వంటి గ్రీన్హైడ్రోజన్ డెరివేటివ్స్‌ను గ్రీన్కో సరఫరా చేస్తుందని పేర్కొంది. కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గించడంలో గ్రీన్‌కోతో భాగస్వామ్యం సాయపడుతుందని గ్రాన్యూల్స్ ఛైర్మన్ సీ కృష్ణప్రసాద్ చెప్పారు.