హైదరాబాద్, వెలుగు: ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, ఏఐజి హాస్పిటల్స్‌లో తమ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ బ్రెస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది. ఏషియన్ మెడికల్ ఫౌండేషన్, యూసీ బ్రెస్ట్ ఫౌండేషన్ ఏఐజి హాస్పిటల్స్‌తో కలిసి గ్రాన్యూల్స్ ట్రస్ట్ దీనిని చేపట్టింది. అందరికీ క్యాన్సర్గుర్తింపు చికిత్సను లక్ష్యంగా పెట్టుకుంది. "బ్రెస్ట్ ఎక్స్‌ప్రెస్"లో అత్యాధునిక మామోగ్రఫీ అల్ట్రాసౌండ్ సామర్థ్యాలు ఉంటాయి.
హిమోగ్లోబిన్, రక్త పోటు, గ్లూకోజ్ లెవల్స్ వంటి అవసరమైన ఆరోగ్య పరీక్షల కోసం తగిన సౌకర్యాలు ఉన్నాయి. ఈ క్లిష్టమైన సేవలను అందించడంతోపాటు ఉచితంగా మందులు ఇస్తామని హైదరాబాద్‌కు చెందిన గ్రాన్యూల్స్ప్రకటించింది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రాన్యూల్స్, ట్రస్ట్ చైర్‌పర్సన్ ఉమా చిగురుపాటి చెప్పారు.