హైదరాబాద్, వెలుగు: మెటోప్రోలోల్ సక్సినేట్ ఎక్స్‌టెండెడ్- రిలీజ్ టాబ్లెట్స్ 25 ఎంజీ, 50 ఎంజీ, 100 ఎంజీ, 200 ఎంజీ డోసుల కోసం యూఎస్ ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డిఎ) నుంచి అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ (ఏఎన్‌డీఏఏ) ఆమోదం వచ్చిందని గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. ఈ రిఫరెన్స్ లిస్టెడ్ డ్రగ్ ప్రొడక్ట్ (ఆర్‌ఎల్‌డి) టోప్రోల్-ఎక్స్ఎల్ టాబ్లెట్స్... టోప్రోల్ అక్విజిషన్ ఎల్ఎల్సీకి బయో ఈక్వివలెంట్.
మెటోప్రోలోల్ సక్సినేట్ ఈఆర్ మాత్రలను రక్తపోటును తగ్గించడానికి వాడతారు. గ్రాన్యూల్స్కు యూఎస్ ఎఫ్‌డీయే నుండి మొత్తం 57 ఏఎన్‌డీఏఏ అప్రూవల్స్ ఉన్నాయి. ఐక్యూవిఐఏ / ఐఎమ్‌ఎస్ హెల్త్ ప్రకారం, మెటోప్రోలోల్ సక్సినేట్ ఈఆర్ టాబ్లెట్‌ల ప్రస్తుత యూఎస్ వార్షిక మార్కెట్ విలువ సుమారు 321 మిలియన్ డాలర్లు.