న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్లో హైదరాబాద్‌కు చెందిన గ్రాన్యూల్స్ ఫార్మా రూ.47 కోట్ల లాభం సంపాదించింది. గత ఏడాది జూన్ క్వార్టర్లో ఇది రూ.127 కోట్లు ఆర్జించింది. వార్షికంగా లాభం 62 శాతం తగ్గింది. గ్రాస్ మార్జిన్లు 50 శాతం నుండి 51 శాతానికి పడిపోయాయి.
జూన్ 2023తో ముగిసిన క్వార్టర్లో కంపెనీ ఆదాయం (కన్సాలిడేటెడ్) రూ. 986 కోట్లుగా ఉండగా, జూన్ 2022తో ముగిసిన క్వార్టర్లో రూ. 1,020 కోట్లు వచ్చాయి. ఇబిటా 35 శాతం తగ్గి రూ. 137 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్లు తాజా క్వార్టర్లో 21 నుండి 14 శాతానికి తగ్గాయి. మే నెలలో సైబర్ సెక్యూరిటీ దాడి కారణంగా కంపెనీ తాజా క్వార్టర్ఫలితాలపై ప్రభావం పడిందని గ్రాన్యూల్స్ తెలిపింది. దీంతో కార్యకలాపాలలో అంతరాయాలకు దారితీసింది.