ఎడారి ఊళ్లో ద్రాక్ష పంటలు జోరు

ఎడారి ఊళ్లో ద్రాక్ష పంటలు జోరు

ఈ ఊరు ఎడారిలో ఉంది.  అయితేనేం అడవి, సముద్రం కూడా  ఉన్నాయి. ఇంతకీ ఎక్కడ ఉంది? ఈ ఊరు అంటున్నారా.. పెరూలోని ‘ ఐకా’ సిటీ. ఒకే ఊళ్లో ఎడారి, అడవి, సముద్రం ఉండటంతో పాటు ద్రాక్ష పండ్ల తోటలకు కేరాఫ్​ అడ్రస్​ కూడా. పెరూలో యునిక్​ విలేజ్​గా, టూరిస్ట్​ స్పాట్​గా పేరున్న ‘ఐకా’ గురించి..

ఒకే దగ్గర ఎడారి, అడవి, సముద్రం... ఎలా ఉంటుంది ? అక్కడ ద్రాక్షపండ్ల తోటలు ఉండటం ఏంటి? అంటున్నారా... అదే ఆ ఊరు స్పెషాలిటీ. అక్కడ ఉన్న క్లైమేట్​ కారణంగా ఈ ఊళ్లో  డిఫరెంట్​​ సీన్స్​ కనిపిస్తాయి. అందుకే 16వ శతాబ్దంలోనే ఈ ఊరిని డెవలప్​ చేసి ఫైనాన్షియల్​ సిటీగా మార్చారు. ఇక్కడ ఎడారి టూర్లు, బీచ్​ వ్యూ, వ్యవసాయం ఎంతో ఫేమస్​.

పెరూలో సముద్రానికి దగ్గరగా ఉండే ఊళ్లు చాలానే ఉన్నాయి. కానీ వాటన్నింటిలో ఐకా మాత్రం ప్రత్యేకం. అందుకే అది ఇంట్రెస్టింగ్ టూరిస్ట్​ ప్లేస్​గా పేరు తెచ్చుకుంది. ఏడాది పొడుగునా ఇక్కడికి టూరిస్ట్​లు వస్తూనే ఉంటారు. 

పెరూలో ఉన్న ఎన్నో గ్రామాలకంటే ముందే  ఐకా ఉంది. 15 వ శతాబ్దంలో ఐకా, పక్కనే ఉండే ‘నాజ్కా  వాలీ’  కలిసిపోయాయి. తర్వాత 1500ల్లో స్పెయిన్ దేశస్తులు ఐకాకు వచ్చారు.  ‘జెరోనిమో లూయిస్ డి’ అనే వ్యక్తి  ఐకాను డెవలప్​​ చేసి దాన్ని సిటీగా డిక్లేర్​ చేశారు. ఇలా జూన్ 17, 1563న  సిటీ ఏర్పాటైంది.  ఆ కాలం నాటి ఆర్కిటెక్చర్​, చెక్కు చెదరని భవనాలు ఐకాలో ఇప్పటికీ ఉన్నాయి.  ప్రతి ఏటా జూన్​ 17న ఐకా సిటీలో ఫెస్టివల్స్​ జరుగుతాయి. వారం రోజుల పాటు జరిగే ఈ యానివర్సరీ ఎంత అందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ప్యారడైజ్​ఫెస్టివల్​, గాస్ట్రోనమిక్ ఫెయిర్స్, మినీ- మారథాన్ ,  లోకల్​  కల్చరల్​  ఈవెంట్స్​ ... ఇలా ఎన్నో ​ ఉంటాయి. జూన్​ నెలలో పెరూ టూర్​ వెళ్లిన టూరిస్ట్​లు  వీటిని     మిస్​కాకుండా చూస్తారు.

ఇసుకతిన్నెల్లో ఇండ్లు
ఎడారిలో ‘హువాకాచిన ఒయాసిస్​’  చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రోడ్డుకు 300 మీటర్ల దూరంలో ఉన్న భూభాగంలో  కొన్ని ఇండ్లు ఉంటాయి. ఆ ఇండ్లని ‘హువాకాచిన  ఒయాసిస్’ ​ అంటారు. అక్కడికి వెళ్లిన ఎవరైనా దీన్ని చూడాల్సిందే. ఈ చిన్న ఒయాసిస్​లో బగ్గీ సవారీలు, శాండ్​ బోర్డింగ్​ చేస్తారు టూరిస్ట్​లు.  విశాలమైన ఐకా ఎడారి కి వెళ్తే అద్భుతమైన ఎక్స్​పీరియెన్స్​లు ఎన్నో సొంతమవుతాయి. హువాకాచిన ఒయాసిస్​కు శివారులో బాలెస్టాప్​ దీవులు ఉంటాయి. బాలెస్టాప్​ దీవుల్లో ఉండే వాళ్లు బిజినెస్​ చేస్తారు. ఐకా ఎడారికి వచ్చే టూరిస్ట్​లకు గైడ్​గా ఉంటారు. ఎడారి, జీప్​ సఫారీల ద్వారా డబ్బులు సంపాదిస్తారు.

ద్రాక్ష తోటలు, పత్తి ఉత్పత్తి  
ఐకాలో ఎడారి ఎంత ఫేమస్సో.. వ్యవసాయం కూడా అంతే, ఏడాదంతా వాతావరణంలో​ హెచ్చుతగ్గులు లేకుండా ఉంటుంది. ఐకాను  ఫైనాన్షియల్​ సిటీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రజలు లోకల్​గా వైన్​ ను తయారు చేస్తారు. దాని పేరు ‘పిస్కో’. ద్రాక్ష పండ్లను పులియపెట్టి తయారు చేసే ఈ వైన్​కు పెరూ కల్చర్​ వైన్​గా  పేరుంది. ఐకా నగరంలో వైన్​ సెంటర్ల ముందు పిస్కో తయారు చేయడం చూడొచ్చు.