
- గ్రేప్ ఫెస్టివల్ కు తరలివస్తున్న సందర్శకులు
రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధన క్షేత్రంలో ‘గ్రేప్ ఫెస్టివల్’ సందడిగా సాగుతోంది. సిటీ నలుమూలల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. ఇక్కడ ఆర్గానిక్పద్ధతిలో పండించిన 60 రకాల ద్రాక్ష పండ్లు అందుబాటులో ఉన్నాయి. తోటలో కలియ తిరుగుతూ కావాల్సినన్ని పండ్లు తినొచ్చు. నచ్చిన రకం ద్రాక్ష తీసుకోవచ్చు. ఈ గ్రేప్ ఫెస్టివల్ గురువారం మొదలైంది. 15 రోజులపాటు కొనసాగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సందర్శకులను తోటలోకి అనుమతిస్తున్నారు. వెరైటీని బట్టి ధరలు ఉన్నాయి.
రెడ్ గ్లోబ్, క్రిమ్‌సన్ సీడ్‌లెస్, ప్లేమ్ సీడ్ లెస్, రిజామత్, టేబుల్ వెరైటీస్, జ్యూస్, వైన్, ఇంపోర్టెట్ తదితర వెరైటీ ద్రాక్ష పండ్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి వస్తున్న సందర్శకులతో ద్రాక్ష తోట రోజంతా సందడిగా ఉంటోంది.