చిప్స్, గ్రేప్స్, కండోమ్స్, లిప్​స్టిక్​ల ఆర్డర్లే ఎక్కువ

చిప్స్, గ్రేప్స్, కండోమ్స్, లిప్​స్టిక్​ల ఆర్డర్లే ఎక్కువ
  • 31న రాత్రి ఆన్​లైన్​లోఎక్కువ మంది కొన్నవి ఇవే
  • దేశవ్యాప్తంగా అమ్మకాల వివరాలు వెల్లడించిన ఈ కామర్స్ సంస్థలు

న్యూఢిల్లీ: న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్​లైన్​లో అమ్మకాలు రికార్డుకెక్కాయి. ఎక్కువ మంది గ్రేప్స్, కండోమ్స్, లిప్​స్టిక్స్, కూల్​డ్రింక్స్, చిప్స్ ఆర్డర్ చేశారని బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్​స్టామార్ట్ వంటి కంపెనీలు బుధవారం ఓ రిపోర్టును విడుదల చేశాయి. బ్లింకిట్ సీఈవో చెప్పినదాని ప్రకారం.. 31న రాత్రి గ్రేప్స్, చిప్స్, సోడా బాటిల్స్​తోపాటు లిప్​స్టిక్స్, సాఫ్ట్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఎక్కువగా ఆర్డర్ చేశారంట. రాత్రి 8 గంటల టైంలో ఎక్కువగా ఆలూ బుజియా, 7 వేలదాకా ఐస్ క్యూబ్ ప్యాకెట్లను కస్టమర్లకు అందించామన్నారు.

వీటి తర్వాత ఎక్కువగా అమ్ముడైనవి కండోమ్స్ ప్యాకెట్లేనని చెప్పారు. అయితే, గ్రేప్స్ మీద జనాలకెందుకు అంత ఇంట్రెస్ట్ పెరిగిందో తనకు మాత్రం అర్థం కాలేదంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇదే టైంలో స్విగ్గీ, ఇన్​స్టామార్ట్  నిమిషానికి 853 చిప్స్ ప్యాకెట్ల చొప్పున ఒక్క రాత్రిలోనే 5 లక్షల చిప్స్ ప్యాకెట్లను డెలివరీ చేశాయంట. ఆశ్చర్యకరంగా బ్లైండ్​ఫోల్డ్స్, హ్యండ్​కఫ్​ల ఆర్డర్స్ కూడా పెరిగాయని తెలిపాయి. బిగ్ బాస్కెట్​లో మాత్రం కూల్ డ్రింక్స్ కు ఆర్డర్స్ ఎక్కువగా వచ్చాయని, చిప్స్ నాచోస్ వంటి వస్తువులు రోజువారీతో పోలిస్తే మంగళవారం రాత్రి 300 శాతం పెరిగాయని రిపోర్టులో వెల్లడైంది. కూల్ డ్రింగ్స్ వెయ్యి శాతం, ఓవరాల్​గా మిగతా ఐటమ్స్ అమ్మకాలు 600 శాతం పెరిగాయని చెప్పింది.