గ్రేప్స్, ఐస్, కండోమ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా మరెన్నో.. న్యూ ఇయర్ ఆన్ లైన్ ఆర్డర్స్ ఇవే ఎక్కువట..!

గ్రేప్స్, ఐస్, కండోమ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా మరెన్నో.. న్యూ ఇయర్ ఆన్ లైన్ ఆర్డర్స్ ఇవే ఎక్కువట..!

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇండియన్స్ ఆర్డర్ చేసిన ఐటమ్స్ చూస్తుంటే మతిపోవాల్సిందే. నూతన సంవత్సరానికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పే క్రమంలో..  తమకు ఇష్టమైన.. కావాల్సిన వస్తువులను నిర్మొహమాటంగా ఆర్డర్ చేశారట మన ఇండియన్స్. 

ఇండియా టాప్ క్విక్ కామర్స్ సంస్థలు బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ.. తదితర సంస్థలు రివీల్ చేసిన విషయాలకు ఆశ్చర్యం వేయక మానదు. బ్లింకిట్ సీఈవో చెప్పిన వివరాల ప్రకారం చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఎక్కవ ఆర్డర్ చేశారంట. 

బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా, స్విగ్గీ కో ఫౌండర్ ఫని కిషన్ తదితరులు ఎక్స్ (ట్విట్టర్) లో తమ సైట్లలో చేసిన ఆర్డర్స్ పై పోస్టుల్లో తెలిపారు. 

 డిసెంబర్ 31, 2024న రాత్రి 8 గంటలకు 2.3 లక్షల ఆలూ భుజియా ప్యాకెట్లను డెలివరీ చేసినట్లు Blinkit నివేదించింది, అయితే Swiggy Instamart చిప్‌ల ఆర్డర్‌లు రాత్రి 7:30 గంటల సమయంలో నిమిషానికి 853కి చేరుకున్నట్లు తెలిపారు. సాయంత్రం కోసం సర్చ్ చేసిన వాటిలో పాలు, చిప్స్, చాక్లెట్, ద్రాక్ష, పనీర్ ఉన్నాయి.

బ్లింకిట్ రాత్రి 8 గంటల సమయానికి 6,834 ఐస్ క్యూబ్‌లను డెలివరీ చేసిందట. బిగ్‌బాస్కెట్ ఐస్ క్యూబ్ ఆర్డర్‌లలో 1290% ఉన్నాయట.  7:41 గంటలకు ఐస్ క్యూబ్స్ ఆర్డర్స్119 కిలోలకు చేరుకుందట.

ALSO READ | న్యూ ఇయర్ కిక్.. 5 రోజుల్లో రూ.1255 కోట్ల మద్యం తాగేశారు

అయితే న్యూ ఇయర్ రోజు అత్యధికంగా టిప్ ఇచ్చింది హైద్రాబాద్ లో అని దిండా ఎక్స్ లో పోస్ట్ చేశారు. “హైదరాబాద్‌కు చెందిన ఒకరు మా డెలివరీ బాయ్ కి ఈ రోజు అత్యధిక టిప్ (₹2500) ఇచ్చారు. అత్యధిక టిప్ లు మాత్రం బెంగళూరు వచ్చాయట. మొత్తం ₹1,79,735 టిప్‌ న్యూ ఇయర్ కానుకగా ఇచ్చారట.