కంప్యూటర్ యుగంలో జనాలు బిజీ బిజీగా గడుపుతున్నారు. దీంతో టైంకు తినక.. ఏదో ఆకలైనప్పడు.. ఆ సమయంలో ఏది దొరికితే అది తిని కడుపు మంట చల్చార్చుకుంటున్నారు. అందుకే ఇప్పుడు చాలామంది అజీర్ణం. మలబద్ధకం లాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివాళ్లు ఈ పండ్లను తింటే జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్ధకం తగ్గుతుంది. ద్రాక్షలో ఫైబర్ పుష్క లంగా ఉంటుంది. వంద గ్రాముల ద్రాక్షను తింటే నాలుగు గ్రాములఫైబర్ లభిస్తుంది. దాంతో పేగుల్లో మలం కదలిక సరిగ్గా ఉంటుంది. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్ధకం పోతుంది.
ద్రాక్షలను నిత్యం తింటే జీర్ణ సమస్య నుంచి బయటపడొచ్చు. నారింజ పండ్లలోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నారింజను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే, వాటిలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఈ పండ్లలో ఉండే నారింజెనిన్ అనే పదార్థం లాక్సేటివ్ గా పనిచేస్తుంది. కాబట్టి నారింజ తీసుకుంటే జీర్ణ సమస్యలు దూర మవుతాయి.జామ పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని పోగొడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
జీర్ణ సమస్యలు ఉండవు. జామ ఆకులను తిన్నా ఆయా సమస్యల నుంచి బయటపడొచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. జామ ఆకుల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి డయేరియాను తగ్గిస్తాయి.
-వెలుగు,లైఫ్-