చాలీచాలని ఆదాయంతో బతుకు బండిని నెట్టుకొస్తున్న ఆ కుటుంబాన్ని భగవంతుడు చిన్నచూపు చేశాడు. ఆ ఇంటి ఇల్లాలికి భయంకరమైన క్యాన్సర్ మహమ్మారి సోకడంతో, గండం నుంచి గట్టెక్కించమని దేవుణ్ని ప్రార్ధించి వస్తుండగా ఆ దంపతులిద్దర్ని ఓ కారు ఢీకొంది. ఆ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలవడంతో పాటు భర్త చేయి కూడా విరగడంతో ప్రస్తుతం వారి కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
చెన్నైలోని సాలిగ్రామంలో ఉంటున్న బిజ్జు, సుజాత దంపతులు గత నెల 22న ప్రతీ ఆదివారం చర్చికి వెళ్లినట్లుగానే ఆ రోజు వెళ్లారు. సుజాతకు బ్రెస్ట్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉందని తెలియడంతో ట్రీట్ మెంట్ కోసం కేరళలోని తిరువనంతపురానికి వెళదామనుకుని నిశ్చయించుకున్నారు ఆ దంపతులు. అందుకోసం ముందుగా దేవుని ఆశీస్సుల కోసం చర్చికి వెళ్లి, ప్రత్యేక ప్రార్ధనలు చేసి తిరిగి ఇంటికి వస్తుండగా వారి బైక్ ను ఓ కారు ఢీకొంది.
పూనమల్లి రోడ్‌లోని అంపా మాల్ దగ్గర వేగంగా వస్తున్న ఓ కారు వారి బైక్ ను వెనుక నుండి ఢీకొట్టడంతో వారిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో సుజాతకు తుంటి భాగం, భుజం దగ్గర ఎముకలు విరిగిపోయాయి, ఆమె తల, పాదాలకు గాయాలయ్యాయి. బిజ్జుకు ఎడమ చేయి విరిగిపోయింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే వారిని సమీపంలో ఉన్న బిల్‌రోత్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ కారును అడ్డుకొని, కారు నడుపుతున్న మహిళ కూడా డాక్టరేనని గుర్తించి బాధితులతో పాటు వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు.
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న బిజ్జు స్నేహితుడు అనిల్ జార్జ్ వెంటనే ఆసుపత్రికి వెళ్లగా.. బిజ్జు, సుజాత ట్రీట్ మెంట్ ఖర్చులను తానే భరిస్తానని ఆ లేడీ డాక్టర్ హామీ ఇచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి మాయమైంది. దీంతో జార్జ్ పోలీస్ కంప్లయింట్ ఇవ్వగా.. పోలీసులు ఆమెపై FIR నమోదు చేశారు.
ఆ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించేకునేందుకు డబ్బులు లేక ప్రస్తుతం వారు ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్య, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో చిన్న ఎలక్ట్రిక్ షాప్ నడిపే బిజ్జుకు చేయి విరగడంతో ప్రస్తుతం వారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. చావుబతుకుల మధ్య పోరాటం చేస్తున్న భార్యను, విరిగిన చేయితో అక్కడే ఉండి ఆమెకు సేవ చేస్తున్నాడు బిజ్జు.
వారి చికిత్సకు మొత్తం రూ.30 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఎవరైనా సాయం చేస్తారేమోనని ఎదురు చూస్తున్నారు ఆ దంపతులు.
వారికి ఆర్ధిక సాయం చేయానుకునే వారు.. ఈ క్రింద కనబడే లింక్ ను క్లిక్ చేసి, మీరు సాయం చేయాలనుకున్న మొత్తాన్ని డోనేట్ చేయవచ్చు.
https://milaap.org/fundraisers/support-bijumon-b