
న్యూఢిల్లీ: గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ. 1,163.75 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) సాధించింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.1,009.17 కోట్లతో పోలిస్తే 15 శాతం గ్రోత్ నమోదు చేసింది. కంపెనీ ఆపరేషనల్ రెవెన్యూ 10 శాతం పెరిగి రూ.27,485.54 కోట్ల నుంచి రూ.30,220.68 కోట్లకు చేరుకుంది. స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన చూస్తే కంపెనీ రెవెన్యూ రూ.6,442 కోట్లుగా, ఇబిటా రూ. 1,354 కోట్లుగా రికార్డయ్యింది..
ALSO READ : అమెరికాలోనే చదవాలి.. ఇండియన్ స్టూడెంట్ల చాయిస్ ఇదే!