ఇండియా మాకు పెద్దన్న లాంటిది

కొలంబో: భారత్ తమకు పెద్దన్న లాంటిదని శ్రీలంక మాజీ క్రికెటర్ జయసూర్య అన్నాడు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తమ దేశానికి ఇండియా అందిస్తున్న సాయం మరువలేనిదని ఈ మాజీ లెఫ్టాండెడ్ బ్యాట్స్ మన్ చెప్పాడు. ‘పొరుగు దేశమైన భారత్ లంకకు పెద్దన్నలా అండగా ఉంటోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇండియా మాకు అందిస్తున్న సాయం మరువలేనిది. అందుకు భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు. ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కడం అంత సులభం కాదు. భారత్ తోపాటు మరిన్ని దేశాలు మాకు అండగా ఉంటే ఈ పరిస్థితుల నుంచి త్వరగా బయటపడతామనే నమ్మకం ఉంది’ అని జయసూర్య వ్యాఖ్యానించాడు. కాగా, కరెంట్ కష్టాలు ఎదుర్కొంటున్న శ్రీలంకను బయటపడేసేందుకు.. భారత్ 2.70 లక్షల మెట్రిక్ టన్నుల చమురును ద్వీపదేశానికి సరఫరా చేసింది. అలాగే మెడిసిన్స్ ను కూడా పంపింది. ‘భారత్ నుంచి త్వరలో మాకు మరిన్ని ఔషధాలు రానున్నాయి. ఇది గొప్ప సాయం’ అని కొలంబో జాతీయ కంటి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ దమ్మిక చెప్పారు. ఇండియా అందిస్తున్న మద్దతుకు థ్యాంక్స్ తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం:

‘వీరమల్లు’ కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్

గోటబయ రాజీనామా  ప్రసక్తే లేదు

కాలినడకన రామయ్య పెండ్లికి