కరీంనగర్లో గ్రావ్టన్​ షోరూమ్ ప్రారంభం

కరీంనగర్లో గ్రావ్టన్​ షోరూమ్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రిక్​ వెహికల్స్​తయారు చేసే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ గ్రావ్టన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కంపెనీ యాజమాన్యంలోని ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. కరీంనగర్​తోపాటు సిద్ధిపేట కస్టమర్లకు ఇది సేవలు అందిస్తుంది.  

సర్వీస్ సంబంధిత సమస్యలను 24 గంటల్లోగా పరిష్కరిస్తామని గ్రావ్టన్ ​తెలిపింది.   ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్​ పరశురామ్ పాకా తన చిన్ననాటి టీచర్​కు (ఈ ప్రాంతానికి చెందినవారు) మొదటి రిజిస్టర్డ్ గ్రావ్టన్ క్వాంటా ఈవీ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బహూకరించారు.  

భారతదేశంలోని ప్రతి మూలకు ప్రపంచ స్థాయి తమ ప్రొడక్టులను తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. గ్రావ్టన్ ప్రధాన ఉత్పాదన అయిన క్వాంటా కేవలం 6.5 రోజుల్లో 4,011.9 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసిందని, బీఎల్​డీసీ మోటర్​, ఎల్​ఎంఎఫ్​సీ బ్యాటరీ, హై-స్ట్రెంగ్త్ రిబ్-కేజ్డ్ ఛాసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి దీని ప్రత్యేకతలు అని పరశురామ్​ అన్నారు.