జానీ మాస్టర్​ను సన్మానించిన తెలంగాణ యువత

జానీ మాస్టర్​ను సన్మానించిన  తెలంగాణ యువత

ఖైరతాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేషనల్​ఫిల్మ్​అవార్డ్స్​లో ఉత్తమ సినీ కొరియోగ్రాఫర్​గా నిలిచిన జానీ మాస్టర్ ను ‘తెలంగాణ యువత’ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ.. ప్రముఖ నటుడు, డ్యాన్స్​మాస్టర్ ప్రభుదేవా టాలెంట్​ఉన్నవాళ్లను గుర్తించి ప్రోత్సాహిస్తారని, ఆయన వల్లే తనకు తమిళ ఇండస్ట్రీలో అవకాశం వచ్చిందని చెప్పారు. 

తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్మడి సతీశ్​ మాట్లాడుతూ.. తన మిత్రుడు జానీ మాస్టర్ కు నేషనల్​అవార్డు రావడం సంతోషకరమన్నారు. మున్ముందు ఇలాంటి మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. సన్మాన కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ గణేశ్, దైవజ్ఞశర్మ, రాజీవ్, మునాఫ్, నిఖిల్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా ‘తిరుచిత్రాంబలం’ అనే తమిళ సినిమాలో మేఘం కరుకత సాంగ్​కు డ్యాన్స్​ కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్​ను నేషనల్ ​అవార్డు వరించిన సంగతి తెలిసిందే.