Virat Kohli: గొప్ప గౌరవంగా భావిస్తున్నాం.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కోహ్లీ

Virat Kohli: గొప్ప గౌరవంగా భావిస్తున్నాం.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కోహ్లీ

పొట్టి ప్రపంచ క‌ప్‌తో స్వదేశంలో అడుగుపెట్టిన రోహిత్ సేనకు అడుగ‌డుగునా అపూర్వ స్వాగ‌తం ల‌భిస్తోంది. వీరు ప్రయాణించిన విమానం గురువారం ఉద‌యం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే సంబరాలు మొదలైపోయాయి. భారత త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. అభిమానుల 'భారత్ మాతాకీ జై..' నినాదాలతో ఎయిర్ పోర్టు పరిసరాలు మార్మోగాయి. 

ఢిల్లీలో ల్యాండైన కొద్ది సేపటి అనంతరం భారత్ బృందం.. ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసానికి వెళ్లారు. ప్రధానితో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. ఈ సంద‌ర్భంగా మోదీ ప్రతి క్రికెట‌ర్ వ‌ద్దకు వెళ్లి అప్యాయంగా ప‌ల‌క‌రించి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈ భేటిపై భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రధానికి  కృతజ్జతలు తెలిపాడు. ప్రధానిని కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, జట్టును తన నివాసానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపాడు కోహ్లీ.

ధన్యవాదాలు సార్..

"ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోఢీజీని కలవడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాము. మమ్మల్ని ప్రధాన మంత్రుల నివాసానికి (sic) ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్.." అని కోహ్లీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. మరోవైపు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సైతం సోషల్ మీడియా వేదికగా మోడీకి ధన్యవాదాలు తెలిపాడు. కాగా,  ప్రధానమంత్రి కార్యాలయం షేర్ చేసిన విజువల్స్‌లో, బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో కోహ్లీ ప్రధాని మోడీతో మాట్లాడుతున్నట్లు కనిపించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)