ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. మహారాష్ట్రలోని పుణె స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో ప్రత్యర్థి ఇంగ్లాండ్‌పై 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచుల సిరీస్‌లో 3-1 తేడాతో మరో మ్యాచు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది భారత్.
ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ బౌలర్ షకీబ్ మహమూద్ భారత్ టాపార్డర్‌ను చావు దెబ్బ కొట్టాడు. మహమూద్ దెబ్బకు 12 పరుగులకే టీమిండియా 3 కీలక వికెట్లు కోల్పోయింది. యంగ్ ఓపెనర్ అభిషేక్ వర్మ 29 పరుగులతో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ సంజు శాంసన్ ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ సూర్య, తిలక్ వర్మ డకౌట్ అయ్యారు.
వెనువెంటనే సూర్య, తిలక్ ఔట్ కావడంతో భారత్ పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ సమయంలో రింకూ సింగ్, శివమ్ దూబే, పాండ్య జట్టును ఆదుకున్నారు. రింకూ సింగ్ 30 రన్స్ చేయగా.. పాండ్య (53), దూబే (53) హాఫ్ సెంచరీలతో భారత్ కు భారీ స్కోర్ అందించారు. ఇన్సింగ్స్ స్టార్టింగ్ చూసిన తర్వాత భారత్ స్కోర్ 150 దాటడం గగనమే అనుకోగా.. చివర్లో ఈ ముగ్గురి మెరుపులతో టీమిండియా భారీ స్కోర్ చేసింది.
మొత్తానికి టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జామీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్సేఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 166 రన్స్ మాత్రమే చేసింది. దీంతో 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ALSO READ | IND vs END: పాండ్యా అంటే ఫ్లవర్ అనుకుంటిరా.. ఫైరూ: ఇంగ్లండ్ ఎదుట ధీటైన టార్గెట్
ఇంగ్లాండ్ కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (23), బెన్ డకెట్ (39) శుభారంభం అందించారు. యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (51)తో చేలరేగగా.. మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించకపోవడంతో ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ సాధించారు. ఐదు మ్యాచుల సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ దక్కించుకుంది.