
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ పరిధిలోని బీచ్లలో చెట్లు నాటాలని ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా బీచుల్లో కీలోమీటర్ల మేర ట్రీ రింగులను ఏర్పాటు చేసింది. అయితే దీనిపై స్థానిక ప్రజలను భిన్నమైన స్పందన వచ్చింది. ఎలాంటి గ్రీనరీ లేని బీచులలో చెట్లు నాటడం మంచిదేనని కొందరంటున్నారు.పర్యావరణ శాస్త్రవేత్తలు దీనికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే బీచులలో వృక్షాలు పెంచడం సాధ్యమేనా అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
మెరీనా నుంచి ఇంజంబక్కం వరకు వందలాది కాంక్రీట్ ట్రీ రింగులు ఏర్పాటు చేసింది GCC. బీచుల సమీపంలో పచ్చదనం అనే మాట కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బీచుల్లో చెట్లు పెంచితే నీడతో పాటు పర్యావరణంకూడా రక్షించబడుతుందని చెబుతున్నారు. దీనిపై పర్యావరణ శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రేమికులు పాజిటివ్ గా స్పందించారు. బీచుల్లో సరైన చెట్లు నాటడం మంచిదే.. చెడ్డ ఆలోచన కాదు అని అంటున్నారు. మరికొందరు ఈ బీచ్లు ఆలివ్ రిడ్లీ తాబేళ్ల గూడు స్థలాలు, ఇసుక బీచ్ లలో చెట్లు నాటితే ఇసుక దిబ్బల వల్ల వృక్షాలను పెంచడం సాధ్యం కాదంటున్నారు. ఇది ప్రజాధనాన్ని వృధా చేయడమే అంటున్నారు.
Also Read :- దేశంలోనే మొట్టమొదటి ఫ్రోజెన్ జూపార్క్ ఎక్కడుందో తెలుసా?
అయితే బీచ్ లలో చెట్ల పెంపకంపై ఉన్న సందేహాలపై జీసీసీ డిప్యూటీ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. చెన్నై పచ్చదనాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. లోతుగా పాతుకుపోయేవి, తక్కువ నీరు అవసరమయ్యే పామిరా పామ్, ఇండియన్ బీచ్ (పుంగం) వంటి స్థానిక చెట్ల జాతులను నాటుతున్నామన్నారు. సముద్రపు అలలకు దూరంగా ఈ చెట్లపెంపకం చేయడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక తాబేళ్ల గూడు, దిబ్బలు వృక్షసంపదకు ఎలాంటి భంగం కలిగించవు అన్నారు.
పర్యావరణ పరిరక్షకులు, కేర్ ఎర్త్ ట్రస్టీ ఆర్జే రంజిత్ డేనియల్స్ ఈ బీచ్ లలో చెట్ల పెంపకం మంచిదే అన్నారు. లిట్టోరల్ చెట్ల జాతులను మాత్రమే బీచ్ లలో పెంచితే మంచి ఫలితం ఉంటుందన్నారు. వేగంగా పెరిగే జాతులను నాటకూడదు. సముద్ర ఆలలకు, తాబేళ్లు గూడు కట్టుకునే ప్రాంతాలకు దూరంగా చెట్లను నాటాలని సూచించారు.