గ్రేటర్ ఫలితం తేల్చేది.. ముంపు బాధితులే

పంచాయతీలు, మున్సిపాలిటీలు..  లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైనా సరే.. వాటి గడువు ముగిసిపోయి నెలలు, ఏళ్ల తరబడి ప్రత్యేక అధికారి పాలన తర్వాత గానీ పెట్టిన దాఖలాలు లేవు. కానీ 65 ఏళ్ల హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాలక మండలి గడువు ముగియక ముందే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది చట్టంలోని వెసులుబాటు ఆధారంగానే అయినప్పటికీ..  బల్దియా  ముందస్తు ఎన్నికలు కొత్తగా అనిపిస్తున్నాయి. 

గత ఎన్నికల్లో బల్దియాలోని 150  డివిజన్లలో 99 గెలుచుకుని మేయర్ పీఠం సొంతం చేసుకున్న టీఆర్ఎస్ ఈ సారి కూడా కాస్త అటుఇటుగా అంతే స్థాయిలో గెలుపు తమదేనని ధీమాగా ఉంది. అయితే ఇటీవల సిటీని భారీ వర్షాలు ముంచెత్తడంతో అనేక కాలనీలు ముంపు బారినపడిన తీరు.. ప్రజల్లో గతంలో ఎన్నడూ లేనంతగా కోపం గూడుకట్టుకోడానికి కారణమైంది. దాదాపు 40 రోజులు దాటినా అనేక కాలనీల్లో వరద, బురద కష్టాలు ఇంకా తీరలేదు. ఆ బాధితులకు అండగా ఉండడం కోసమని సీఎం కేసీఆర్ రూ.550 కోట్ల పరిహారాన్ని మంజూరు చేశామని చెబుతున్నా.. దాన్ని వారికి చేర్చడంలో అక్రమాలు జరగడం మరింత ఆక్రోశాన్ని పెంచాయి. ప్రతీ బాధిత కుటుంబానికి రూ.10 వేలు ఇస్తామని చెప్పారు. కానీ మొదట్లో కొన్ని ఏరియాల్లో అధికారులు, లోకల్ టీఆర్ఎస్ లీడర్ వెళ్లి ఆ మొత్తం ఇచ్చి.. మళ్లీ అందులో సగం డబ్బు వెనక్కి లాక్కున ఘటనలు చాలా జరిగినయ్.

ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు మీ సేవలో అప్లై చేసుకుంటే అకౌంట్ లో వేస్తామన్నారు. జనాలు భారీగా క్యూల్లో నిలబడి అప్లై చేసుకుంటున్న సమయంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, ఆ సాయం నిలిపేయడంపై జనం భగ్గుమన్నారు. ఎన్నికల టైమ్ లో డబ్బులిస్తే పాజిటివ్ అవుతుందనుకుంటే అది రివర్స్ అయింది. మరి ఈ సమయంలో వరద ముంపు బారినపడ్డ  జనం ఎటు నిలబడతారో చూడాలి. ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని కాంగ్రెస్, దుబ్బాక వేవ్ కంటిన్యూ అవుతుందని బీజేపీ ధీమాగా ఉన్నాయి. అయితే ఎప్పుడూ 50 శాతం కూడా పోలింగ్ జరగని సిటీలో ఈ సారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే గానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై పార్టీల ఆశలు నిజమవుతాయి. లేదంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఉన్న అవకాశాలను కొట్టిపారేయలేం. -జాజుల దినేశ్, లెక్చరర్​, మహబూబ్​నగర్

for more News…

సోషల్ మీడియాలో ప్రచారానికి స్పెషల్​ ఏజెంట్లు

కరోనా టీకా ట్రాన్స్ పోర్ట్ కు విమానాలు రెడీ

V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు 

మనోళ్లపై ‘స్పుత్నిక్-V’ ట్రయల్స్.. మూడ్రోజుల్లో స్టార్ట్

ఆక్స్‌‌ఫర్డ్‌‌ వ్యాక్సిన్​ కోసం పేద దేశాలు వెయిటింగ్​