లష్కర్ బోనాలకు 175 ప్రత్యేక బస్సులు

లష్కర్ బోనాలకు 175 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్​ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు గ్రేటర్​ఆర్టీసీ175 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సిటీలోని 24 ప్రాంతాల నుంచి బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆర్టీసీ గ్రేటర్​హైదరాబాద్​జోన్ ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 

కుషాయిగూడ రైల్వే స్టేషన్ నుంచి 4, ఎంజీబీఎస్​నుంచి 5, జూబ్లీబస్​స్టేషన్​నుంచి 5, బాలాజీనగర్​నుంచి 8, నాంపల్లి నుంచి 8, చార్మినార్​ నుంచి 5, రిసాలాబజార్​నుంచి 8, వెంకటాపురం నుంచి 8, ఓల్డ్అల్వాల్​నుంచి 8, మెహిదీపట్నం నుంచి 8, కుషాయిగూడ నుంచి 8, చర్లపల్లి నుంచి 8, హకీంపేట నుంచి 8, ఓల్డ్​బోయిన్​పల్లి నుంచి 8, చార్మినార్​ నుంచి 8, సైనిక్​పురి నుంచి 8, సనత్​నగర్​నుంచి 8, జామియా ఉస్మానియా నుంచి 8, జీడిమెట్ల నుంచి 8, జగద్గిరిగుట్ట నుంచి 8, కేపీహెచ్​బీ నుంచి 8, బోరబండ నుంచి 7, పటాన్​చెరు నుంచి 7 బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ బస్సులన్నీ ఆలయ సమీపంలోని బైబిల్​హౌస్, ఎంజీరోడ్, బాటా సెంటర్​వరకు వెళ్తాయి. 

సికింద్రాబాద్​రైల్వేస్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్​ వద్ద హెల్ప్​డెస్క్​ఏర్పాటు చేశారు. వివరాలకు సికింద్రాబాద్(99592 26147), జేబీఎస్(99592 26143), ఎంజీబీఎస్(99592 26130), రేతిఫైల్(99592 26154), కోఠి(99592 26160) డిపోలకు కాల్​ చేయొచ్చు.