
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ ఆర్టీసీ అధికారులు ఐటీ కారిడార్‌లో పరిధిలో మరికొన్ని గ్రీన్‌మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సోమవారం నుంచి మరికొన్ని ఏసీ సర్వీసులను ప్రారంభిస్తున్నారు. 216 డబ్ల్యూ(లింగంపల్లి నుంచి మెహిదీపట్నం వయా నల్లగండ్ల, గోపన్‌పల్లి, విప్రో, ఖాజాగూడ క్రాస్‌రోడ్స్, దర్గా, గెలాక్సీ, నానల్‌నగర్), 216 జీ(లింగంపల్లి నుంచి లక్ష్మీజీఏఆర్వయా నల్లగండ్ల, గోపన్‌పల్లి, మైల్స్టోన్, విప్రో) రూట్లలో కొత్త సర్వీసులు తిరుగుతాయి.
216 డబ్ల్యూ సర్వీస్మొదటి బస్సు లింగంపల్లి నుంచి ఉదయం 6.50 గంటలకు, ఆఖరి బస్సు రాత్రి10.10 వరకు ఉంటుంది. మెహదీపట్నం నుంచి ఉదయం 8గంటలకు ఆఖరి బస్సు రాత్రి 11 గంటల ఉంటుంది. 216 జీ సర్వీస్మొదటి బస్సు లింగంపల్లిలో ఉదయం 6.15 కు, ఆఖరి బస్సు రాత్రి 9.05 గంటలకు ఉంటుంది. లక్ష్మి జీఏఆర్నుంచి ఉదయం 7.05 గం ఫస్ట్బస్సు, లాస్ట్బస్సు రాత్రి 9.55 గంటలకు ఉంటుంది.