లక్సెట్టిపేట డిగ్రీ కాలేజ్​కి గ్రీన్ ఛాంపియన్ అవార్డ్

లక్సెట్టిపేట డిగ్రీ కాలేజ్​కి గ్రీన్ ఛాంపియన్ అవార్డ్

లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్​కి రాష్ట్రస్థాయి గ్రీన్ ఛాంపియన్ అవార్డు దక్కింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్​లో నిర్వహించిన కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓలా ఈ అవార్డును అందుకున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, క్లీన్ గోదావరి సేవ్ గోదావరి లాంటి కార్యక్రమాలతోపాటు కాలేజీలో చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ ఈ అవార్డు లభించిందని ప్రిన్సిపాల్ ఆనందం వ్యక్తం చేశారు.