హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ వెహికల్స్తయారు చేసే క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ అందించే గ్రీన్ డ్రైవ్ మొబిలిటీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఎంఓయూ ప్రకారం.. క్వాంటమ్ ఎనర్జీ 5,000 ‘బిజినెస్’ ఈవీలను గ్రీన్ డ్రైవ్ మొబిలిటీకి అందజేస్తుంది. లాస్ట్‌మైల్, డెలివరీ ఫ్లీట్ల అవసరాలను తీర్చడానికి క్వాంటమ్ ‘బిజినెస్’ పేరుతో ఎలక్ట్రిక్టూవీలర్ను తయారు చేసింది.
ఈ బండ్లు మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు ఆనందంగా ఉందని గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ ఫౌండర్ హరికృష్ణ అన్నారు. దీనివల్ల తమ వినియోగదారులకు అత్యాధునిక ఎలక్ట్రిక్ బండ్లను అందించడం సాధ్యమవుతుందని చెప్పారు.