హైదరాబాద్, వెలుగు: హార్ట్‌ఫుల్‌నెస్, కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వచ్చేనెల17న గ్రీన్ హార్ట్‌ఫుల్‌నెస్ రన్ మూడో ఎడిషన్ జరగనుంది. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ నిర్వహించే ఈ రేసులో 1.5కి.మీ రేస్, 5కె, 10కె, హాఫ్ మారథాన్ పోటీలు ఉంటాయని మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు తెలిపారు.
ఈ రేస్‌కు సంబంధించిన జెర్సీని ఇండియా అథ్లెట్ దండి జ్యోతికశ్రీ, టీటీ ప్లేయర్ నైనా జైస్వాల్‌తో కలిసి గ్రాన్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్- ఉమా చిగురుపాటి - ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనంలో ఈ రన్ జరుగుతుందని, అలాగే ఇతర రాష్ట్రాలు, దేశాల్లో వంద సెంటర్లలో దాదాపు లక్ష మంది ఇందులో ఏకకాలంలో పాల్గొంటారని తెలిపారు. ఈ ఈవెంట్ ద్వారా లభించే ఆదాయంతో 15 వేల మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తామని ప్రకటించారు.