కొండగట్టు అడవిలో వెయ్యి ఎకరాలు దత్తత తీసుకుంటా: ఎంపీ సంతోష్

కొండగట్టు, వెలుగు: కొండగట్టు గుట్టల దగ్గరలోని కొడిమ్యాల ఫారెస్ట్​రేంజ్​లో మొత్తం 1,094 ఎక రాల అటవీ భూమిని దత్తత తీసుకుంటున్నట్లు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ​తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటి పచ్చదనంతో అడవిని అందంగా తీర్చిదిద్దుతామన్నారు. దశలవారీగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తామన్నారు. మొదటి విడతలో రూ.కోటి కేటాయిస్తున్నట్లు తెలిపారు. కొండగట్టుతో సీఎం కేసీఆర్​కు బలమైన అనుబంధం ఉందని, అనేకసార్లు అంజన్నను దర్శించుకున్న అనంతరం కొండగట్టు అటవీ భూముల్లో సేదతీరి న అనుభూతులు ఉన్నాయని ఎంపీ తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ భూమి సరిహద్దుకు కంచె ఏర్పాటు చేసి వన్యప్రాణులకు రక్షణ కల్పిస్తామన్నారు. పండ్ల మొక్కలు నాటి మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు పచ్చని ప్రకృతి మధ్య సేద తీరేలా మట్టితో వాకింగ్ ట్రాక్ ప్రహరీ గోడలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా దట్టమైన అటవీ భూముల్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో మెక్కలు నాటడం.. భూములు ఆక్రమించుకోవడంలో భాగంగా వేసిన ఎత్తుడగ అని అంజన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.