హైదరాబాద్ లోమెట్రో రైల్ సెకండ్ ఫేజ్ భూసేకరణకు మరో అడుగు పడింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు చేపడుతున్న 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి కావల్సిన భూసేకరణ డిక్లరేషన్ కు కలెక్టర్ ఆమోదం తెలిపారు. దీంతో ఓల్డ్ సిటీ మెట్రో రైల్ భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ రూట్లో రోడ్ల విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి భూములు సేకరించనున్నారు. భూసేకరణకు ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ నోటీసులిచ్చింది.
ALSO READ | తెలంగాణ, ఏపీ నుంచి విమానాలను పెంచిన ఎయిర్ ఇండియా
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మెట్రో ఫేస్ 2 కారిడార్ VI..MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు దాదాపు 200 పైగా ఆస్తులకు డిక్లరేషన్ ఇచ్చింది. శనివారం ( నవం బర్ 16) ఆస్తుల సేకరణ డిక్లరేషన్ కు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి ఆమోదం తెలిపారు. ఆస్తుల సేకరణ పూర్తయితే డిసెంబర్ లో అవార్డు ఆమోదం జరుగు తుందని కలెక్టర్ తెలిపారు. 2025 జనవరిలో మెట్రో రైలు పనులు ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు.