వరంగల్ లో వైఎస్ షర్మిల పాదయాత్రకు నిబంధనలతో కూడిన అనుమతి లభించింది. చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా వద్ద గతేడాది నవంబర్ 28న షర్మిల అరెస్ట్ తో పాదయాత్ర ఆగిపోయింది. కాగా ఈనెల 25న తిరిగి పాదయాత్ర నిర్వహించుకోవాడనికి వైఎస్ఆర్ నేతలు సీపీకి దరాఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2వ నుంచి 18వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించుకోవడానికి సీపీ రంగనాథ్ అనుమతిచ్చారు. అయితే ఈ యాత్రను ఉదయం నుంచి 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని కండిషన్ పెట్టారు.
పార్టీలకు, కులాలకు, మతాలకు లేదా వ్యక్తిగతంగా గానీ ఎవరినీ ఉద్దేశించి వివాస్పద వాఖ్యలు చేయొద్దని సూచించారు. ర్యాలీల్లో టపాసులు ఉపయోగించవద్దని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కల్గించవద్దనే నిబంధనలతో సీపీ పర్మిషన్ మంజూరు చేశారు. అయితే వైఎస్ షర్మిల తిరిగి ప్రారంభించబోయే యాత్ర.. శంకరమ్మ తండా గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట, జఫర్ గడ్, ఘన్ పూర్, నర్మెట్ట, జనగామ, దేవురుప్పల, పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు సాగనుంది.