![Good Health : గ్రీన్ టీ తాగితే.. పళ్లు వాటికి అవే క్లీన్ అవుతాయి.. బ్యాడ్ బ్యాక్టీరియాను చంపేస్తుంది..!](https://static.v6velugu.com/uploads/2025/02/green-tea-most-useful-teeth-health_JOTdbnlwiB.jpg)
హెల్త్ ను కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం.. ఎక్కువ మంది మిగతా విషయాల మీద కాన్సన్ ట్రేషన్ చేసినంతగా పళ్ల మీద చేయరు. నిజానికి నోటిని శుభ్రంగా ఉంచుకుంటే సగం ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టే. మనకి అందుబాటులో ఉండే వాటితోనే పళ్లను నోటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు.
గ్రీన్ టీలో పళ్లను కాపాడే లక్షణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. పళ్లకు సంబంధించిన సమస్యల్లో పాచి ఒకటి. అది పళ్ళు పుచ్చి పోవడానికి కారణమవుతుంది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల దీని బారి నుంచి బయటపడవచ్చని దంత వైద్య నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ టీలో ఎపిగలోకాటెజిన్ గాలెట్ ఉంటుంది. ఇది పుచ్చిపోవడానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో విపరీతంగా పోరాడుతుంది. కొన్నికొన్ని సార్లు మనం తీసుకునే ఫుడ్ లోని చిన్నచిన్న తునకలు పళ్లలో ఇరుక్కుని, బ్యాక్టీరియా ఫామ్ అయి. దంత క్షయానికి కారణమవుతుంది. ఈ విషయంలోనూ గ్రీన్ టీ సాయపడుతుంది.
బ్యాక్టీరియాను తగ్గించడంలో గ్రీన్ టీ మంచి రోల్ పోషిస్తుందని ఎన్నో స్టడీస్ చెప్తున్నాయి. నోటికి సంబంధించిన ఎఫెక్ట్ గొంతు వెనక భాగానికి కూడా పాకుతుంది. అక్కడ బ్యాక్టీరియా పెరిగి నోటి దుర్వాసనకు కారణమవుతుంది. ఆ ప్రదేశాన్ని టూత్ బ్రెష్ తో కూడా క్లీన్ చేయలేం. దాంతో ఒకసారి బ్యాక్టీరియా చేరాక, దుర్వాసనను దూరం చేయడం కష్టమైన పని. దీనికి కూడా గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. గ్రీన్టిలోని పాలీఫెనాల్స్ ఈ బ్యాక్టీరియాను అడ్డుకోవడంలో సాయపడుతుంది.
-వెలుగు,లైఫ్-