భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటుకు అడుగు ముందుకు పడింది. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్ పరిశీలనకు ఈ నెల 20న కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కేంద్ర బృందం పర్యటించనుంది.
కేంద్ర బృందం పర్యటన, డీపీఆర్‌కు అయ్యే ఖర్చులకు గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 38లక్షలను ఇటీవలే శాంక్షన్ చేస్తూ ఆదేశిలిచ్చింది. కాగా విమానశ్రయ ఏర్పాటుతో కొత్తగూడెంకు మహర్ధశ పట్టనుందని అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.