గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. నేషనల్​ హైవేపై లారీల క్యూ.. 

గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. నేషనల్​ హైవేపై లారీల క్యూ.. 

పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లాలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో భాగంగా పెనుబల్లి మండలం సీతారామాపురం గ్రామం వద్ద విజయవాడ–భద్రచలం నేషనల్ హైవే పై 5 కిలోమీటర్ల పొడవునా రామగుండం ఎన్​టీపీసీ నుంచి బూడిదను తెచ్చిన లారీలు రెండు రోజుల నుంచి క్యూ కట్టాయి.

సీతారామపురం వద్ద లారీలు వచ్చిన వెంటనే అన్​లోడింగ్ పాయింట్ కు పంపకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో లారీలు నేషనల్ హైవే పైన నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో డస్ట్ పేరుకుపోవడంతో దుమ్ము లేచి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.