ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ముత్తారం, వెలుగు : నాగపూర్ నుంచి విజయవాడ వరకు వెళ్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్​మెంట్​ను వెంటనే రద్దు చేయాలని  ముత్తారం మండలానికి చెందిన భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. శుక్రవారం ముత్తారంలో వారు మాట్లాడారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములని  గ్రీన్ ఫీల్డ్ హైవే కి ఇవ్వడం కుదరదని అన్నారు. భూ సర్వే జరుగుతుందని తెలిసి మండల కేంద్రానికి చెందిన సముద్రాల సమ్మయ్య అనే రైతు అదే భూమిలో ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. భూ సేకరణ ఆపాలని, మహారాష్ట్రలో జరిగిన విధంగా గ్రీన్ ఫీల్డ్ హైవేను బ్రౌన్ ఫీల్డ్ హైవేగా మార్చాలని రైతులంతా కలిసి సంతకాల సేకరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.  సమావేశంలో కార్యక్రమంలో శంకర్, నూనేటి కృష్ణ, వాజీద్ పాషా, లక్ష్మణ్, మల్లయ్య, రాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

మతి భ్రమించి మాట్లాడుతుండ్రు

సభ సక్సెస్ ను జీర్ణించుకోలేక బీఆర్ఎస్​ విమర్శలు

కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సక్సెస్​ను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ లీడర్లు మతి భ్రమించి మాట్లాడుతున్నారని కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ బి. ప్రవీణ్ రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం పట్టణంలోని చైతన్యపురి ఎంపీ ఆఫీస్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ బండి సంజయ్ ను విమర్శించే నైతిక హక్కు మేయర్ సునీల్ రావుకు లేదన్నారు. అశేష సంఖ్యలో ప్రజలు సభకు రావడం బీఆర్ఎస్ లీడర్లుకు మింగుడు పడడం లేదని ఆరోపించారు. కేసీఆర్ మెప్పు పొందేందుకు అనవసర, అర్థరహిత ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

చెరువులకు నీరు విడుదల చేయాలి

ఎస్సారెస్పీ ఆఫీసర్లతో ఎమ్మెల్యే సమీక్ష 

జగిత్యాల, వెలుగు: నియోజకవర్గ పరిధిలోని ధర్మ సముద్రం, కండ్లపల్లి చెరువులతోపాటు ఎస్సారెస్సీకి అనుబంధంగా ఉన్న చెరువులకు డిసెంబర్ 18న నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం జగిత్యాలలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎస్సారెస్సీ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. గుట్రాజ్ పల్లి, గుల్లపేట్ లలో చెక్ డ్యాంలను త్వరగా పూర్తి చేయాలన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా బీట్ బజార్ ప్రైమరీ, ఓల్డ్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, ఉర్దూ మీడియం ఫోర్ట్ హై స్కూల్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ ఎహెచ్ ఖాన్, డీఈ వాజిద్​ అలీ ఉన్నారు.

మోటార్లకు కెపాసిటర్లు బిగించుకోవాలి

మెట్ పల్లి, వెలుగు : డివిజన్ పరిధిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న ప్రతీ రైతు తమ మోటర్లకు తప్పనిసరిగా కెపాసిటర్ బిగించుకోవాలని మెట్ పల్లి విద్యుత్ శాఖ డీఈ తిరుపతి  అన్నారు. శుక్రవారం మండలంలోని బండలింగాపూర్ లో రైతులకు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డివిజన్ పరిధిలో 57 వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, రైతులు తమ పంపుసెట్లకు కెపాసిటర్లు బిగించుకోవడంతో 20 శాతం విద్యుత్ ఆదా అవుతుందన్నారు. కెపాసిటీర్ బిగించుకుంటే ట్రాన్సఫార్మర్లు తరచూ కాలిపోయే అవకాశం ఉండదన్నారు. ఈ సందర్భంగా 324 మంది రైతులు తమ కరెంట్ మోటార్ల బిల్లులు రూ.లక్షా 40వేలు చెల్లించారు. కార్యక్రమంలో  సర్పంచ్ అంజయ్య, ఎంపీటీసీ స్వప్న, ఏఈ ప్రశాంత్, మాజీ సర్పంచులు, రైతులుపాల్గొన్నారు.

‘మానేరు’లో అలరించిన జంగిల్‌‌ బుక్‌‌

కరీంనగర్ టౌన్,వెలుగు: పట్టణంలోని మంకమ్మతోట సాయి మానేరు స్కూల్​లో శుక్రవారం ప్రీ ప్రైమరీ విద్యార్థులు ఘనంగా ది జంగిల్‌‌ బుక్‌‌ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణను పెద్దపెద్ద చెట్ల కొమ్మలతో అలకరించారు. అడవి జంతువుల వేషధారణలతో ప్రీ ప్రైమరీ విద్యార్థులు అలరించారు. సుమారు 100 మంది విద్యార్థులు వివిధ రకాల వేషాలు ధరించారు. ఈ సందర్భంగా మానేర్ విద్యాసంస్థల చైర్మన్ కడారు అనంతరెడ్డి, డైరెక్టర్ సునీతారెడ్డితో కలిసి మాట్లాడారు. అడవిలో నివసించే జంతువులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌‌ ప్రిన్సిపల్‌‌ గూడ సరితారెడ్డి, టీచర్స్, స్డూడెంట్లు పాల్గొన్నారు. 

చెరువులకు నీరు విడుదల చేయాలి

ఎస్సారెస్పీ ఆఫీసర్లతో ఎమ్మెల్యే సమీక్ష 

జగిత్యాల, వెలుగు: నియోజకవర్గ పరిధిలోని ధర్మ సముద్రం, కండ్లపల్లి చెరువులతోపాటు ఎస్సారెస్సీకి అనుబంధంగా ఉన్న చెరువులకు డిసెంబర్ 18న నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం జగిత్యాలలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎస్సారెస్సీ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. గుట్రాజ్ పల్లి, గుల్లపేట్ లలో చెక్ డ్యాంలను త్వరగా పూర్తి చేయాలన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా బీట్ బజార్ ప్రైమరీ, ఓల్డ్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, ఉర్దూ మీడియం ఫోర్ట్ హై స్కూల్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ ఎహెచ్ ఖాన్, డీఈ వాజిద్​ అలీ ఉన్నారు.

‘చిక్కాల’ను అనర్హుడిగా ప్రకటించాలని ధర్నా

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సెస్ ఎన్నికల్లో తంగళ్లపల్లి డైరెక్టర్ స్థానానికి నామినేషన్ వేసిన సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామరావును అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ లీడర్లు శుక్రవారం సెస్ ఆఫీస్​ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ ఎ.వేణు మాట్లాడుతూ సెక్షన్ 51 తెలంగాణ కో ఆపరేటివ్ సోసైటీస్ రూల్స్1964 ప్రకారం అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి సెస్ పోటీకి అనర్హుడని అన్నారు. రామారావు గతంలో సెస్ చైర్మన్ గా పని చేసినప్పుడు రూ.33 కోట్ల ఆవినీతి ఆరోపణలు ఉన్నట్లు అప్పటి డిస్ట్రిక్ కో ఆపరేటివ్ ఆఫీసర్ రామాంజనేయులు ఎంక్వైరీ చేశారని, రిపోర్ట్​ పెండింగ్​లో ఉందన్నారు. చిక్కాల అవినీతిపై హై కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు ఎంక్వైరీ చేయమని చెప్పినట్లు పేర్కొన్నారు. అనంతరం ఎన్నికల అధికారి మమతకు వినతిపత్రం అందించారు. ధర్నాలో లీడర్లు రాజిరెడ్డి,రాజాసింగ్ ఠాకూర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.