జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా దళాలను టార్గెట్ చేసి గ్రెనేడ్ దాడికి తెగబడ్డారు. బుధవారం పుల్వామాలోని కాకాపోరా చౌక్ సమీపంలో గుర్తు తెలియని ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. అయితే ఆ గ్రెనేడ్ భద్రతా దళాల మీద కాకుండా జనసంచారం ఉన్న రోడ్డుపై పడింది. దాంతో 12 మంది పౌరులు గాయపడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఒక ఉన్నతాధికారి తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రెనేడ్ దాడి జరగడంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
కాగా.. జమ్మూలోని నాగ్రోటాలోని బాన్ టోల్ ప్లాజా సమీపంలో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్ ప్రారంభం అయింది. భద్రతా దళాలు మరియు ఉగ్రవాదులకు మధ్య కాల్సులు జరుగుతుండటంతో అధికారులు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు.
#WATCH Jammu and Kashmir: An encounter is underway near Ban toll plaza in Nagrota, Jammu. Security tightened, Jammu-Srinagar National Highway closed. More details awaited.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/PYI1KI0ykH
— ANI (@ANI) November 19, 2020