కాబూల్ : అఫ్గానిస్తాన్‌లో ల్యాండ్ మైన్ పేలి 9 మంది చిన్నారులు మృతిచెందారు. గజ్ని ప్రావిన్స్‌లోని గేరు జిల్లాలో ఆదివారం ఈ ఘోరం చోటుచేసుకుంది. రష్యన్ దండయాత్ర సమయంలో పేలకుండా ఉండిపోయిన ల్యాండ్ మైన్ ఇప్పుడు పేలిందని అధికారులు చెప్పారు.
ఈమేరకు సోమవారం -గజ్నీలోని తాలిబాన్ సమాచార, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హమీదుల్లా నిసార్ వివరాలు వెల్లడించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో నాలుగు నుంచి పదేండ్లలోపు వయసు గల ఐదుగురు బాలికలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారని- గజ్నీ పోలీసులు తెలిపారు.