Shah Rukh Khan: ఆ దేశపు బంగారు నాణెంపై షారుఖ్‌ చిత్రం..గాంధీ తర్వాత రెండవ భారతీయుడుగా బాద్‌షాకు అరుదైన గౌరవం

Shah Rukh Khan: ఆ దేశపు బంగారు నాణెంపై షారుఖ్‌ చిత్రం..గాంధీ తర్వాత రెండవ భారతీయుడుగా బాద్‌షాకు అరుదైన గౌరవం

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రెవిన్ మ్యూజియం (Grevin Museum)  బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌(Shah Rukh Khan)ను బంగారు నాణెంతో సత్కరించింది. ఈ అరుదైన గౌరవం అందుకున్న తొలి నటుడు ఆయనే. ఈ బంగారు నాణేలు షారూఖ్ ఖాన్‌ యొక్క పోలికను కలిగి ఉంటాయి. దీంతో గ్రెవిన్ మ్యూజియంలో తన పేరిట బంగారు నాణేలు ఉన్న తొలి భారతీయ నటుడిగా షారూఖ్ నిలిచాడు.

మహాత్మా గాంధీ తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండవ భారతీయుడు బాద్‌షా షారూఖ్ కావడం విశేషం. ఈ బంగారు నాణెం ఫోటోను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేయగా..ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే, భారతీయ సినిమా ఇండస్ట్రీకి, సామాజిక బాధ్యతతో దాదాపుగా మూడు దశాబ్ధాలకు పైగా షారుఖ్ ఎన్నో విధాలైన సేవలు అందిస్తుండటంతో ఈ అరుదైన గౌరవం దక్కింది. 

బాద్ షా షారుఖ్ ఖాన్ 2023లో వరుసగా మూడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో కనిపించి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. 'పఠాన్', 'జవాన్' మరియు 'డుంకీ' సినిమాలు రికార్డ్స్ వేటలో తన స్థానాన్ని మరింత స్ట్రాంగ్ చేశాయి. ప్రస్తుతం షారుఖ్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో 'కింగ్' అనే మూవీలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.