ప్రజావాణికి వినతుల వెల్లువ

కరీంనగర్ టౌన్/ జగిత్యాల టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ రాజన్నసిరిసిల్ల, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాకేంద్రాల్లో  సోమవారం నిర్వహించిన  గ్రీవెన్స్ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతులు వెల్లువెత్తాయి. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్  పమేలా సత్పతి  పాల్గొని 212 అర్జీలను స్వీకరించారు.  సిరిసిల్ల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రజావాణిలో ప్రజల నుంచి ధరఖాస్తులు స్వీకరించారు. తనకు పెన్షన్ ఇప్పించాలని బీవై నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన దివ్యాంగుడు ప్రజావాణిలో అర్జీ ఇచ్చేందుకు వచ్చాడు.

గమనించిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అతని దగ్గరికే వెళ్లి అర్జీ తీసుకున్నాడు. సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజన్న జిల్లాలో మొత్తం 41 దరఖాస్తులు వచ్చాయి. జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణికి  37 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.  ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్​ యాస్మిన్ బాష అధికారులను ఆదేశించారు.