- 429 దరఖాస్తుల స్వీకరణ
కరీంనగర్ టౌన్, వెలుగు : గ్రీవెన్స్ సెల్‌కు రికార్డు స్థాయిలో వినతులు వెల్లువెత్తాయి. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్ సెల్‌కు కలెక్టర్ పమేలాసత్పతి హాజరై 429 అర్జీలను స్వీకరించారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్ పరిధిలోని తన భూమిని బీఆర్ఎస్ నేత ఈద శంకర్‌రెడ్డి లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నాడని అల్గనూర్‌కు చెందిన సిరిసిల్ల అంజయ్య గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు.
శాతవాహన వర్సిటీలో 149 మంది అవుట్ సోర్సింగ్‌ఉద్యోగుల నియామకంలో అవినీతి జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లాకార్యదర్శి మచ్చ రమేశ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మికిరణ్, డీఆర్వో పవన్ కుమార్, ఆర్డీవో కె.మహేశ్వర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
జగిత్యాల టౌన్, వెలుగు : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జగిత్యాల కలెక్టర్ యాష్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 50 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ తెలిపారు.
ఎలాంటి నోటీసులు లేకుండా ఎన్‌హెచ్ 63 కోసం భూసేకరణకు హద్దులు ఏర్పాటు చేస్తున్నారని, కొత్త సర్వే నిలిపివేసి పాత సర్వే ప్రకారం భూసేకరణ చేయాలని వెల్గటూర్ మండలం స్థంభంపల్లి రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రీవెన్స్‌లో అడిషనల్ కలెక్టర్ దివాకర, ఇతర అధికారులు పాల్గొన్నారు.