ప్రభుత్వాల హయాంలో పంపిణీ చేసిన అసైన్డ్​ భూములను కబ్జా చేస్తున్నారు

 ప్రభుత్వాల హయాంలో పంపిణీ చేసిన అసైన్డ్​ భూములను కబ్జా చేస్తున్నారు

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: తమకు గత ప్రభుత్వాల హయాంలో పంపిణీ చేసిన అసైన్డ్​ భూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని బాధితు లు హనుమకొండ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిక్తా పట్నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యా దు చేశారు. సోమవారం హనుమకొండ కలెక్టరే ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్​ ఆధ్వర్యంలో గ్రీవెన్స్​ నిర్వహించారు. హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తి మండలం దేవన్నపేట శివారు సుబ్బయ్యపల్లి గ్రామంలో సర్వే నంబరు 190లోని దళితులకు పంపిణీ చేసిన 13 ఎకరాల 26 గుంటల అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తున్నారని, ఆ భూములను కాపాడి తమకు న్యాయం చేయాలని 50 దళిత కుటుంబాల వారు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మొరపెట్టుకున్నారు.  స్పందించిన కలెక్టర్ సర్వే చేసి విచారణ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.  గ్రీవెన్స్​కు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 72 మంది దరఖాస్తులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ సంధ్యారాణి, డీఎంహెచ్​వో సాంబశివ రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీ లత, అధికారులు పాల్గొన్నారు.

బల్దియాకు 50 ఫిర్యాదులు 

వరంగల్​సిటీ, వెలుగు: సోమవారం బల్దియా హెడ్డాఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ విభాగాలకు ఉన్నతాధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.  ప్రజావాణిలో మొత్తం వివిధ విభాగాలకు చెందిన 50 ఫిర్యాదులు రాగా, టౌన్ ప్లానింగ్ విభాగానికి 21 అర్జీలు వచ్చాయి.  కార్యక్రమంలో అదనపు కమిషనర్ రవీందర్ యాదవ్, డిప్యూటీ కమిషనర్లు అనిసుర్  రషీద్ , జోనా, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేంద్ర మాజీ మంత్రి ఫిర్యాదు

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​  జిల్లా కేంద్రంలో కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్​  రైతుల సమస్యలపై ఫిర్యాదు చేశారు.  ఇనుగుర్తి మండలం చిన్న నాగరం గ్రామ పరిధిలోని వివిధ తండాలకు చెందిన గిరిజన రైతుల పట్టా భూముల పక్కనున్న పోడు భూములతో సరిహద్దు ​సమస్య ఉందని, దానిని పరిష్కరించాలని కలెక్టర్​ శశాంకకు వినతిపత్రం ఇచ్చినట్లు కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్​ తెలిపారు. 

అభివృద్ధి పనులు పెండింగ్​ లేకుండా చూడాలి.. కలెక్టర్​ కృష్ణ ఆదిత్య 

ములుగు, వెలుగు: జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను పెండింగ్​ లేకుండా చూడాలని కలెక్టర్​ ఎస్​.కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. సోమవారం ములుగు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, వై.వి.గణేశ్లతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. జిల్లాలోని వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లో జూనియర్ కాలేజీల కొత్త భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఇంటర్​ బోర్డు కోఆర్డినేటర్​ వెంకటేశ్వర్లును ఆదేశించారు.