ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లో రోడ్డు ప్రమాదం.. ఏపీ యువకుడు మృతి

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లో రోడ్డు ప్రమాదం.. ఏపీ యువకుడు మృతి

లండన్​: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా  గాయపడ్డారు. ప్రమాద వివరాలను లీసెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు వెల్లడించారు. మంగళవారం తెల్లవారుజామున ఏపీకి చెందిన నలుగురు వ్యక్తులు ఓ కారును హైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకొని ఈస్ట్‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లోని లీసెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మార్కెట్‌‌‌‌‌‌‌‌ హార్బరోకు బయలుదేరారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వారి కారు మార్గమధ్యలో రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. 

ఈ ఘటనలో చిరంజీవి పంగులూరి (32) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ వారిని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. గాయపడిన వారిలో ఓ మహిళ సహా ఇద్దరు ప్యాసింజర్లు, కారు డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. దీంతో కారు డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేశామని తెలిపారు.