
- ధర్నా కు దిగిన మహిళలు
సిద్దిపేట రూరల్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని వివిధ గ్రామాల మహిళలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రభుత్వం గృహలక్ష్మి పథకం రద్దు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నారాయణరావుపేట మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు ఇండ్ల మంజూరు పత్రాలు కేసీఆర్ప్రభుత్వంలో వచ్చాయని, దీంతో పాత ఇండ్లు కూలగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేశారు.