SSMB29 స్టోరీ లీక్.. గ్రోక్ ఇంత సింపుల్ గా చెప్పేసిందేంటీ.

SSMB29 స్టోరీ లీక్.. గ్రోక్ ఇంత సింపుల్ గా చెప్పేసిందేంటీ.

SSMB29 Story:

ఈమధ్య సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ "గ్రోక్ ఏఐ"(GROK AI) తెగ హల్చల్ చేస్తోంది. దీంతో ఇన్ఫర్మేషన్ అందించడం కోసం రూపొందించిన ఈ ఏఐ టూల్ ని కొందరు ఫ్యాన్ వార్స్ చెయ్యడానికి ఉపయోగిస్తున్నారు..  ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గ్రోక్ ఏఐ కూడా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి తగ్గట్టుగానే అచ్చం మనిషిలా సమాధానం చెబుతోంది. అయితే ఓ నెటిజన్ "హేయ్ గ్రోక్ SSMB29 స్టోరీ లీక్ చెయ్యచ్చు కదా.?" అని అడిగాడు.. 

దీంతో గ్రోక్ ఏకంగా SSMB29 స్టోరీ లీక్ కాలేదు.. సేఫ్ గా ఉంది.. ఇందులో మహేష్ బాబు లార్డ్ హనుమాన్ ఇన్స్పిరేషన్ తో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయని తెలిపింది. ఇక ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యాక్షన్ అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారని ఇందులో మొదటి పార్ట్ 2027 సమ్మర్ లో రిలీజ్ కానుందని, సెకెండ్ పార్ట్ 2029లో రిలీజ్ కానుందని హింట్ ఇచ్చింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ALSO READ | OTT Romantic Comedy: అఫీషియల్.. ఓటీటీలోకి ధనుష్ డైరెక్ట్ చేసిన కొత్త సినిమా.. తెలుగు స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఈ విషయం ఇలా ఉండగా ఈ SSMB29 ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే ఒడిశాలోని అటవీ ప్రాంతంలో మొదలైంది. ఈ షెడ్యూల్ లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం ఫస్ట్ షెడ్యూల్ పూర్తవడంతో సెకెండ్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. అయితే తెలుగు సినీ సెలెబ్రెటీలు ఒడిశాలో షూటింగ్ కి వెళ్లడంతో అక్కడి ప్రజలు కలిసేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. ఇందులోభంగా మహేష్, రాజమౌళితో కలసి ఫోటోలు దిగారు. ఆలాగే అటవీ ప్రాంతంలో తయారు చేసే కొన్ని హ్యాండ్ మేడ్ ప్రాడక్ట్స్ ని గిఫ్ట్ గా ఇచ్చారు